lahari
Activemeter


FREE FREE Click HERE to goto this site FREE FREE

DreamBook
MAIN
Lahari Home
AP Home

ANDHRA PRADESH
Govt. Info
General Info
Cities & Towns
Maps
Tourism
Oldage Homes
Temples
Education/Colleges
Hospitals/Doctors
Hotels
Business
Shops Online
Food

TELUGU
Information
Portals
Literature
Fonts
Dictionaries
E-mail
VIPs
News Online
Magazines
Associations
Matrimonials
TV Channels
Radio Online
Movies
Stars/Actors
Stars/Actresses
Movie Schedules
Music/Songs
Downloads
Miscellaneous
Telugulo websites

PERSONAL
Articles
Album
About Me
Contact
Chat @Pliner
Chat @AIM

MY BLOGS
Webdunia.com
BlogSpot.com
Blaagu.com

MY GIFS
Flash Banners
Gif Banners
Ads Promotion
Exchange Ads

ఆంధ్ర ప్రదేశ్

     మధ్య యుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ 19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు(నైజాం) గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.

     బ్రిటిషు వారి పాలనలో ఉన్న సర్కారు (కోస్తా) జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందు ఉద్యమించాయి. ఈ ప్రాంతాలు, తమిళ ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేవి. ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమిళుల అహేతుక ఆధిపత్యం భరించలేకా, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలీయమైన కోరిక వలనా వీరు ప్రత్యేక రాష్ట్ర దిశగా ముందు ఉద్యమించారు.

     హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.

     మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభా లోను, విస్తీర్ణం లోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలన లోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు.

     1912 లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

     1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు.

     పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదు ను ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది.

     మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చింది.

     1953 డిసెంబరు‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టు లు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.

     కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

     1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టుల తో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది.

     1953 డిసెంబర్‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. 1955 సెప్టెంబర్ 30 న తన నివేదిక సమర్పించింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్ర శాసనసభలో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి ప్రముఖులు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు విశాలంధ్రకు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండిపోయారు. విశాలాంధ్రను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణా రావు, మాడపాటి హనుమంతరావు, స్వామి రామానంద తీర్థ మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.

     కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపున బూరుగుల రామకృష్ణా రావు, కె.వి.రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.), మర్రి చెన్నారెడ్డి, జె.వి.నర్సింగ్ రావు పాల్గొనగా, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 19 న వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.పెద్దమనుషుల ఒప్పందంలోని చాలా ముఖ్యమైన అంశం:రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి కోస్తా,రాయలసీమ ప్రాంతాల నుండి ఉండాలి.కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.ఈ అంశం ఏనాడూ సరిగా అమలుజరగలేదని తెలంగాణావాదుల వాదన.

     1956 నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన సి.ఎం.త్రివేది, ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.



Andhra Pradesh
Established 1st November, 1956
District(s) 23
Capital Hyderabad
Districts
Adilabad
Anantapur
Chittoor
Kadapa
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Kridhna
Kurnool
Mahbubnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Srikakulam
Visakhapatnam
Vizianagaram
Warangal
West Godavari
Governor Narayan Dutt Tiwari
Chief Minister Y. S. Rajasekhara Reddy
Legislature (seats) Unicameral (294)
Area 275,608 km² (106,413 sq mi)
Population 76,210,007 (5th )         Density 277 /km2 (717 /sq mi)
Language(s) Telugu, Hindi, Urdu
Time zone IST (UTC+5:30)
ISO 3166-2 IN-AP
Website www.ap.gov.in


ANDHRA PRADESH
Govt. Info
General Info
Cities & Towns
Maps
Tourism
Oldage Homes
Temples
Education/Colleges
Hospitals/Doctors
Hotels
Business
Shops Online
Food



తెలుగు భాష


       తెలుగు, భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది. ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది. ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?


మొట్టమొదటి తెలుగు శాసనాలు

తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూర్‌ జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.

ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన

రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాంద్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని "సుత్తనిపాత" గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్‌ రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.

ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.

తెలుగు సాహిత్యము



తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉన్నది.

తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించ వచ్చును. 1) ప్రాఙ్నన్నయ యుగము : క్రీ.శ. 1000 వరకు, 2) నన్నయ యుగము : 1000 - 1100, 3) శివకవి యుగము : 1100 - 1225, 4) తిక్కన యుగము : 1225 - 1320, 5) ఎఱ్ఱన యుగము : 1320 - 1400, 6) శ్రీనాధ యుగము : 1400 - 1500, 7) రాయల యుగము : 1500 - 1600, 8) దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775, 9) క్షీణ యుగము : 1775 - 1875, 10) ఆధునిక యుగము : 1875 నుండి ఇప్పటి వరకు.

తెలుగుసాహిత్యములో వివిధ రకరకాలైన పద్దతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ విషయములు చెప్పుకొనవచ్చు: జానపద సాహిత్యము, వచన కవితా సాహిత్యము, పద కవితా సాహిత్యము, పద్య కవితా సాహిత్యము, చంపూ సాహిత్యము, శతక సాహిత్యము, నవలా సాహిత్యము, చిన్న కథలు, అవధానములు, ఆశుకవిత, సినిమా సాహిత్యము.

ప్రముఖ కావ్యాలు



ప్రముఖ కావ్యాలలో ముఖ్యమైనవిగా వేమన శతకం, మహాప్రస్థానం, పంచతంత్రం, కన్యాశుల్కం, పుత్తడి బొమ్మా పూర్ణమ్మా, పెన్నేటి పాట, శివ తాండవమ్, ఎంకి పాటలు, అమృతం కురిసిన రాత్రి మొదలగు వాటిని చెప్పుకోవచ్చు.

ప్రముఖ తెలుగు సాహితీకారులు

1) ప్రాఙ్నన్నయ యుగము (క్రీ.శ. 1000 వరకు): మూస దనంజయుడు(575), ఎఱ్ఱగుడిపాడు(600), పుణ్యకుమారుడు(630), విక్రమేంద్రవర్మ(600), జయసింహవల్లభుడు (630), అహదహనకర(727), పండరంగుడు (848), కందుకూరు ధర్మవరుడు(850), యుద్ధమల్లుడు(934), విరియాల కామసాని గూడూరు శాసనము(1000)

2) నన్నయ యుగము (క్రీ.శ.1000 - క్రీ.శ.1100): నన్నయ్య లేదా నన్నయభట్టు, మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు, వేములవాడ భీమకవి.

3) తిక్కన యుగము (క్రీ.శ.1225 - క్రీ.శ.1320): తిక్కన్న, పావులూరి మల్లన, ఎలుగంటి పెద్దన, గోనబుద్ధారెడ్డి, చక్రపాణి రంగనాధుడు, మూలఘటిక కేతన, కాచవిభుడు - విట్ఠలుడు (సోదరులు), మంచన, యథావాక్కుల అన్నమయ్య, మారన, బద్దెన, శివదేవయ్య, అప్పనమంత్రి, అధర్వణాచార్యుడు.

4) ఎఱ్ఱన యుగము (క్రీ.శ.1320 - క్రీ.శ.1400): ఎఱ్ఱన, నాచన సోమన, గోన బుద్ధారెడ్డి, హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, అయ్యలార్యుడు, రావిపాటి త్రిపురాంతకుడు (రావిపాటి తిప్పన), చిమ్మపూడి అమరేశ్వరుడు, విన్నకోట పెద్దన.

5) శ్రీనాధ యుగము (క్రీ.శ.1400 - క్రీ.శ.1500): వేమన, శ్రీనాథుడు, పోతన, మడికి సింగన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, ప్రతాప రుద్రుడు, అధర్వణుడు, భైరవి కవి, మనుమంచి భట్టు, తాళ్ళపాక అన్నమయ్య, తాళ్ళపాక తిమ్మక్క, జక్కన, అనంతామాత్యుడు, దగ్గుపల్లి దుగ్గన, దూబగుంట నారాయణ కవి, బైచరాజు వేంకటనాధుడు, వెన్నెలకంటి సూరకవి, పిడుపర్తి సోమన (పిడుపర్తి సోమనాధ కవి), నంది మల్లయ - ఘంట సింగన (జంట కవులు), కొఱవి గోపరాజు, వెన్నెలకంటి అన్నయ్య, విన్నకోట పెద్దన, కూచిరాజు ఎఱ్ఱన, మడికి అనంతయ్య, వెన్నెలకంటి జన్నమంత్రి, కొలని గణపతి దేవుడు, అయ్యలరాజు తిప్పయ్య, ఆంధ్రకవి రామయ్య, చెందలూరు చిక్కయ్య, పశుపతి నాగనాధుడు, దోనయామాత్యుడు, శ్రీధరుడు, కృష్ణమాచార్యుడు, పిడుపర్తి నిమ్మయాచార్యుడు, పిడుపర్తి (మొదటి) బసవకవి, పిడుపర్తి (రెండవ) బసవకవి, ప్రోలుగంటి చెన్నశౌరి, గంగనాచార్యుడు, ఈశ్వర ఫణిభట్టు, సదానంద యోగి, పెనుమత్స వెంకటాద్రి, పెనుమత్స గోపరాజు కవి, అడిదము నీలాద్రి కవి, మాడయ కవి, రేవణూరి తిరుమల కొండయార్యుడు.

6) రాయల యుగము (క్రీ.శ.1500 - క్రీ.శ.1600): కృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభధ్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగడు, తాళ్ళపాక చిన్నన్న, మొల్ల(కుమ్మరి మొల్ల), కందుకూరి రుద్రయ్య, సంకుసాల నృసింహ కవి, ఎలకూచి బాలసరస్వతి, నాదెండ్ల గోపన, కాకుమాని మూర్తికవి, చింతలపూడి ఎల్లన, చదలవాడ మల్లయ, బుట్టేపాటి తిరుమలయ్య, మాదయ్య, తెనాలి రామభద్రకవి, దోనేరు కోనేరు కవి, అద్దంకి గంగాధర కవి, పొన్నగంటి తెలగన్న, శంకర కవి, ఎడపాటి ఎఱ్ఱన, కుమార ధూర్జటి, తరిగొప్పు మల్లన, సారంగు తమ్మయ్య, అందుగుల వెంకయ్య, కాసె సర్వప్ప, భాస్కర పంతులు, బైచరాజు వెంకటనాధ కవి, వెల్లంకి తాతంభట్లు, పిడుపర్తి సోమనాధుడు, పిడుపర్తి బసవకవి, కోట శివరామయ్య, మల్లారెడ్డి, రామరాజు రంగప్పరాజు, మట్ల అనంత భూపాలుడు, కంచి వీరశరభ కవి, తిమ్మరాజు, తాళ్ళపాక తిరువెంగళ నాధుడు, రాయసము వేంకట కవి, చరిగొండ ధర్మన్న, తురగా రామకవి, చెన్నమరాజు చెన్నమరాజు, తెనాలి అన్నయ్య, సవరము చిననారాయణ నాయకుడు, దామెర వేంకటపతి, చిత్రకవి పెద్దన్న, యాదవామాత్య కవి, కంసాలి రుద్రయ్య, ముద్దరాజు రామన్న, చిత్రకవి అనంతకవి, లింగముగుంట రామకవి, లింగమగుంట తిమ్మన్న, వెలగపూడి వెంగనార్యుడు, రెంటూరి రంగరాజు, సింహాద్రి వేంకటాచార్యుడు, రాజలింగ కవి, చిత్రకవి రమణయ్య, కాకునూరి అప్పకవి.

7) దక్షిణాంధ్ర యుగము (క్రీ.శ.1600 - క్రీ.శ.1775): ముద్దుపళని, రంగాజమ్మ, మధురవాణి, రామభద్రాంబ, క్షేత్రయ్య, రామదాసు, లింగనమహి శ్రీకామేశ్వరకవి, చేమకూర వెంకటకవి, విజయ విలాసము, రఘునాధ నాయకుడు, విజయ రాఘవుడు, కోనేటి దీక్షిత చంద్రుడు, చల్లా సూరయ్య, వెలిదండ్ల వేంకటపతి, మట్ల అనంత భూపాలుడు, సవరము చిననారాయణ నాయక్, దామెళ వెంగ నాయక్, విజయరంగ చొక్కనాధుడు, సుముఖము వేంకటకృష్ణప్ప నాయుడు, రఘునాధ తొండమానుడు, శేషము వేంకటపతి, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కుందుర్తి వేంకటాచల కవి, వెలగపూడి కృష్ణయ్య, నుదురుపాటి వెంకయ్య, నుదురుపాటి సాంబయ్య, కట్టా వరదరాజు, కళువ వీర్రాజు, నంజయ్య.

8) క్షీణ యుగము (క్రీ.శ.1775 - క్రీ.శ.1875): త్యాగరాజు, కంకంటి పాపరాజు, కనుపర్తి అబ్బయామాత్యుడు, కూచిమంచి తిమ్మకవి, కూచిమంచి జగ్గకవి, వక్కలంక వీరభద్రకని, అడిదము సూరకవి, ధరణిదేవుల రామయమంత్రి, దిట్టకవి నారాయణకవి, చిత్రకవి సింగనార్యుడు, కృష్ణదాసు, వేమనారాధ్యుల సంగమేశ్వరకవి, అయ్యలరాజు నారాయణకవి, గట్టు ప్రభువు, కృష్ణకవి, తరిగొండ వేంకమాంబ, కృష్ణ మంజరి, చెళ్ళపిళ్ళ నరసకవి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, క్రొత్తలంక మృత్యుంజయకవి, బుక్కపట్నం తిరుమల వేంకటాచార్యులు, పిండిప్రోలు లక్ష్మణకవి, అయ్యగారి వీరభద్రకవి, ఓరుగంటి సోమశేఖరకవి,

9) ఆధునిక యుగము (1875 నుండి):

A) కవులు: ఆవంత్స సోమసుందర్, భావశ్రీ, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర (భాగవతుల శంకరశాస్త్రి), ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ), గుంటూరు శేషేంద్రశర్మ, చిన్న తిరుమలాచార్యులు, తిరుపతి వేంకట కవులు, తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు, గురజాడ అప్పారావు, జాషువా, తుమ్మల సీతారామమూర్తి, తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, త్రిపురనేని రామస్వామిచౌదరి, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, దిగంబర కవులు, దువ్వూరి రామిరెడ్డి, దేవరకొండ బాలగంగాధర తిలక్‌, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, బోయి భీమన్న, రాయప్రోలు సుబ్బారావు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వరవరరావు, విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకరశాస్త్రి, శంకరంబాడి సుందరాచారి, శ్రీశ్రీ, సిద్దేంద్ర యోగి, తిరుమలకృష్ణ దేశికాచార్యులు, కె శివారెడ్డి, అదేపల్లి రామమోహనరావు, నందనోదయ.

B) వచన రచయితలు: చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం పంతులు

C) నాటక రచయితలు: గురజాడ అప్పారావు, కోలాచలం శ్రీనివాసరావు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వేంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఆధునిక నాటక రచయితలు, గొల్లపూడి మారుతీరావు, యండమూరి వీరేంద్రనాధ్.

D) కధా రచయితలు: గురజాడ అప్పారావు, భండారు అచ్చమాంబ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, కాళీపట్నం రామారావు, కాళోజీ నారాయణరావు, చాగంటి సోమయాజులు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, బలివాడ కాంతారావు, మొక్కపాటి నరసింహశాస్త్రి, మిరియాల రామకృష్ణ, భానుమతీ రామకృష్ణ, ముళ్ళపూడి వెంకటరమణ, సత్యం శంకరమంచి, అవసరాల రామకృష్ణారావు, కవన శర్మ, వివినమూర్తి, కేతు విశ్వనాధ రెడ్డి, పెద్దిబొట్ల సుబ్బరామయ్య.

E) నవలా రచయితలు: అడవి బాపిరాజు, చలం (గుడిపాటి వెంకట చలం), త్రిపురనేని గోపీచందు, రాచకొండ విశ్వనాధశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, బుచ్చిబాబు, రంగనాయకమ్మ, వడ్డెర చండీదాస్‌, పెద్దిభొట్ల సుబ్బరామయ్య.

F) ఆధునిక నవలా రచయితలు: యండమూరి వీరేంధ్రనాధ్, మల్లాది వెంకట కృష్ట్ణమూర్తి, యద్దనపూడి సులోచనారాణి, కె.ఎన్‌.వై.పతంజలి, చల్లా సుబ్రహ్మణ్యం, రావినూతల సువర్ణా కన్నన్, మధుబాబు, సూర్యదేవర రామ్మోహనరావు.

G) సినిమా కవులు: కొసరాజు రాఘవయ్య చౌదరి, వేటూరి సుందరరామమూర్తి, సినారె (సి నారాయణ రెడ్డి), సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీశ్రీ.

H) సినిమా మాటల రచయితలు: గొల్లపూడి మారుతీరావు, ఎమ్.వి.యస్.హరనాధరావు.

I) పాత్రికేయులు: కొడవటిగంటి కుటుంబరావు, కోలవెన్ను రామకోటీశ్వరరావు, తిరుమల రామచంద్రాచార్యులు.

J) విప్లవ రచయితలు: గద్దర్

TELUGU
Portals
Literature
Fonts
Dictionaries
E-mail
VIPs
News Online
Magazines
Associations
Matrimonials
TV Channels
Radio Online
Movies
Stars/Actors
Stars/Actresses
Movie Schedules
Music/Songs
Downloads
Miscellaneous
Telugu Websites in Telugu


| Write Your Comments | View All Comments |

THANKS  FOR  YOUR  VISIT
Come soon again



yourezads



Free Banner Exchange by AdsList.co.uk




freestuff, free tools, religion, telugu, andhra pradesh, etc.



Click Here!




Join the Pliner.Net Banner Exchange and advertise here for free!




















website promotion








Worldbannerexchange Banner
Worldbannerexchange BannerWorldbannerexchange Banner



   
| Write Your Comments | View All Comments |

THANKS  FOR  YOUR  VISIT
Come soon again
Easy Submit Free search engine submission URL website promotion SubmitWolf Automated Submission Tool FREE Global Promote Submission Submit Your Site To The Web's Top 50 Search Engines for Free! @Submit!-FREE Promotion Free-banners Freevisits Hotplugins

| Home | Freestuff | Religion | Telugu/AP | India | World | Internet | Civil Engg | Others | Audio | Articles | Album | About Me | Contact |
Webdunia బ్లాగు | BlogSpot బ్లాగు | Blaagu బ్లాగు | Flash Banners | Gif Banners | Ads Promotion | Exchange Ads |
Address: Rambabu. V. Konduru, Chandrajugari Palli, Maditadu (PO), Rayavaram (SO), Cuddapah (Dt), Andhra Pradesh, India, PIN: 516129
Mobile: +91-9176470789 Email lahari67@gmail.com